Singer | S P Balasubramanyam & Harini |
Music | Mani Sharma |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Emaindo Emo Song Lyrics In English:
Emaindo Emo Naa Madhilo Ee Vela
Premaindo Emo Anumaanam Kaligela, Aa Oo
Avuno Kaadho Aḍagaalante… Teguve Chaaladhe
Nijamo Kaadho Teliyakapothe… Thaguve Theladhe
Emaindho Emo Naa Madhilo Ee Vela
Premaindho Emo Anumaanam Kaligela
Avuno Kaadho Aḍagaalante Theguve Chaaladhe
Nijamo Kaadho Teliyakapothe Taguve Theladhe
Hai Rama Idhemi Prema… Hungama Bharincha Tharama
Andammaa Ayomayangaa… Ukkiri Bikkiri Oopiri Sarigama
Hai Rama Idhemi Prema… Hungama Bharincha Tharama
Andammaa Ayomayangaa… Ukkiri Bikkiri Oopiri Sarigama
Ye Chota Naa Paadam Nilabadanantundhi
Prathi Baata Nee Vaipe Pada Pada Antondhi
Manasantha Endhukano Diguluga Untundhi
Adhi Kooda Chithramga Baagane Undhi
Uppenalaa Hrudayamlo… Chelarege Kalavaram
Thappukune Dhaaredho Vethakaali Iddharam
Eppuḍu Modhalayyindho… Nanu Laage Priyaswaram
Eppudu Etu Thosthundho… Chebuthundha Ee Kshanam
Anukokundaa Padadhosindhi Valape Nannilaa
Ho, Vidipokundaa Mudi Vesindhi Bigise Sankelaa
Em Premo Mathe Chedanga… Chikkaamo Amaayakangaa
Gundello Adhorakangaa… Chindara Vandara Thondara Thikamaka
Em Premo Mathe Chedanga… Chikkaamo Amaayakangaa
Gundello Adhorakangaa… Chindara Vandara Thondara Thikamaka
Evarainaa Nee Peru Anukunte Chaalu
Kopamtho Errabadi… Kasire Naa Kallu
Evaraina Ninu Konchem Gamanisthe Chaalu
Gundesadi Ulikipadi Okate Kangaru
Chappuna Okatai Podhaa… Ee Dhooram Jaragani
Ekkadikaina Podhaa… Mana Lokam Verani
Evvariki Ye Maathram… Kanipincham Pommani
Aa Kshaname Manakosam Ekaantham Choodani
Chitike Vesi Piliche Prema Manatho Cheragaa
Manalo Cheri Karige Prema Manamai Maragaa
Emaindho Emo Naa Madhilo Ee Vela
Premaindho Emo Anumaanam Kaligela, Aa Aa Oo
Avuno Kaadho Aḍagalante Teguve Chaaladhe, Oo Oo
Nijamo Kaadho Teliyakapothe Taguve Theladhe, Oo Oo
Avuno Kaadho Aḍagaalante Teguve Chaaladhe
OHo Ho, Nijamo Kaadho Teliyakapothe Taguve Teladhe
Emaindo Emo Song Lyrics In Telugu:
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమైందో ఏమో… అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే… తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే… తగువే తేలదే
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా, ఆ ఓ
అవునో కాదో అడగాలంటే… తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే… తగువే తేలదే
హాయ్ రామా ఇదేమి ప్రేమా… హంగామా భరించ తరమా
అందమ్మా అయోమయంగా… ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ
హాయ్ రామా ఇదేమి ప్రేమా… హంగామా భరించ తరమా
అందమ్మా అయోమయంగా… ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ
ఏ చోటా నా పాదం నిలబడనంటుందీ
ప్రతి బాట నీ వైపే పద పద అంటోందీ
మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుందీ
అది కూడా చిత్రంగా బాగానే ఉందీ
ఉప్పెనలా హృదయంలో… చెలరేగే కలవరం
తప్పుకునే దారేదో… వెతకాలీ ఇద్దరం
ఎప్పుడు మొదలయ్యిందో… నను లాగే ప్రియ స్వరం
ఎప్పుడు ఎటు తోస్తుందో… చెబుతుందా ఈ క్షణం
అనుకోకుండా పడదోసింది… వలపే నన్నిలా
హో, విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెలా
ఏమైందో మతే చెడంగా… చిక్కామో అమాయకంగా
గుండెల్లో అదో రకంగా… చిందర వందర తొందర తికమక
ఏమైందో మతే చెడంగా… చిక్కామో అమాయకంగా
గుండెల్లో అదో రకంగా… చిందర వందర తొందర తికమక
ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలూ
కోపంతో ఎర్రబడి… కసిరే నా కళ్ళూ
ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలూ
గుండె సడి ఉలికిపడి… ఒకటే కంగారూ
చప్పున ఒకటై పోదా… ఈ దూరం జరగనీ
ఎక్కడికైనా పోదా… మన లోకం వేరనీ
ఎవ్వరికీ ఏమాత్రం… కనిపించం పొమ్మనీ
ఆ క్షణమే మన కోసం… ఏకాంతం చూడనీ
చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా
మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా, ఆ ఆ ఓ
అవునో కాదో అడగాలంటే… తెగువే చాలదే, ఓ ఓ
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే, ఓ ఓ
అవునో కాదో అడగాలంటే… తెగువే చాలదే
ఓహో హో, నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
Post a Comment