Movie | ARM (12 September) |
Director | Jithin Laal |
Producers | Listin Stephen, Dr. Zachariah Thomas |
Singer | Sinduri Vishal |
Music | Dhibu Ninan Thomas |
Lyrics | Krishna Kanth |
Eduru Neeku Ledhule Song Lyrics
అంబారాల వీధిలో
చిన్ని చందమామరా
అందునా ఒదిగుందిరా
చెవుల పిల్లిరా…
నీడ నీలి దీవిలో
నీటి మీద మెరిసెరా
ఆ వెన్నెల కాంతిలో
కూర్మముందిరా…
ఆ మాయ తాబేలుకి
తాంబూలా పేటిక కట్టుందిరా
తాపీగా ఈదుకుంటూ నీళ్లలో
ఏమూలో దాక్కుందిరా…
తారలాంటి ఆకారం తాళమే
దానికి వేసుందిరా
లెక్కనే పెట్టలేని వక్కలే
అందులో ఉన్నాయిరా
బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే
బజ్జో, లాలీ జో లాలీ జో నాన్న
సరదాగా ఆడు… మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు
మ్ మ్ మ్ మ్
లాలీ జో… లాలీ జో
మ్ మ్ మ్ మ్
లాలీ జో… లాలీ జో
నీ సుదూర దారిలో
ఆగకుండ సాగిపో
చెయ్యి పట్టి చూపగా తోడులేరనీ
ఎదురు నీకు లేదులే
అడ్డు నీకు రాదులే
దారినిచ్చి జరుగులే
నీటి అలలివే…
నిశ్చింతగానే ఉండు
గాలులే నొప్పిని తీర్చ రావా
ఆకాశ నక్షత్రాలే
దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా
నీ ముందు అగ్గి పుట్టె
చీకట్లే పారదోల కదిలే
నువ్వొక్క విత్తు వేస్తే
ఈ మన్ను అడవళ్లే మార్చేయరా
బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే, బజ్జో
లాలీ జో లాలీ జో నాన్న
సరదాగా ఆడు మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు
నిలవరా… నిలవరా
పరుగున లే కదలరా
నిలవరా… నిలవరా
జగమునే నువ్ గెలవరా
Post a Comment