Lyrics | Mittapalli Surender |
Music | Suresh Bobbili |
Singers | Mangli |
Additional Vocals | Spoorthi Jithendhar, Lakshmi Meghana, Pavani & Ananya |
Shivaratri Song Lyrics in Telugu
నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో
ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో
జుంచక చికజుం జుంచక చికజుం జుంచక చికజుం
నీది కానీ రూపమేది లేదు దేవా… ఈ సృష్టిలో
ఎల్లలోకాలు పల్లవించే… నీ దివ్య దృష్టిలో
విశ్వమైనా భస్మమైనా… ఆ ఆఆ, నీవే
విశ్వమైనా భస్మమైనా… ఆది అంతం నీవే
నీది కానీ రూపమేది లేదు దేవా
ఈ సృష్టిలో
ఎల్లలోకాలు పల్లవించే
నీ దివ్య దృష్టిలో
జుంచక చికజుం జుంచక చికజుం
జుంచక చికజుం జుంచక చికజుం
దీంతాన దీంతాన దిరనన
దీంతాన దీంతాన దిరనన
దీంతాన దీంతాన దిరనననా
నింగిలో నాదము… గాలిలో ప్రాణము
నీటిలో జీవము… అగ్నిలో దీపము
మట్టితో దేహము… ప్రాణికో రూపము
జగతినే పెంచుతూ… పంచినా దైవమా
జననమైనా మరణమైనా…ఆఆ ఆ, నీవే
జననమైనా మరణమైనా… నీవె ఆధారం
శూన్యమైనా శివశివా… నీవే ఆకారం
హరహర మహాదేవ… హిమగిరి వాస
ఆదియోగివై వెలసిన ఈశా.
ఆగిపోని కాలమందు
అల్లుతావు బంధం, ఓ దేవా
ఆగిపోయే ఊపిరిచ్చి… తెంచేవు ప్రాణం
అంతులేని ఆశలోనే… బ్రతుకు నిత్య వేట
యాడవుండి ఆడుతావు… ఇంత వింత ఆట
నిజము నీవే, భ్రమవు నీవే… ఏ ఏ, ఈశా
నిజము నీవే, భ్రమవు నీవే… అంతటా నీవే
అంతరంగం అందనీయవు అర్థనారీశా
నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో
ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో
హర హర హర హర మహాదేవ
హర హర హర హర మహాదేవ
హర హర హర హర మహాదేవ
హర హర హర హర మహాదేవ
దేవా ఈశా దేవా
దేవా ఈశా దేవా దేవా
హర హర హర హర మహాదేవ
Post a Comment