✴️ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.
✴️ శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా దానికి,
శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంబిడి కొడకా..!!
Manashulni Gelavadam Dialogue
✴️ శత్రువుల్ని గెలవడం ఈజీ. కానీ, మనుషుల్ని గెలవడం చాలా కష్టం. ప్రయత్నించు.
మీకు నొప్పి తెలియాలని కొట్టలే, తప్పు తెలియాలని కొట్టా.
✴️ చెట్టు నేలతల్లి మీద బొట్టు లాంటిది. నరకడం మొదలుపెడితే, నీడ ఉండదు… గూడు ఉండదు… మనిషికి మనుగడే ఉండదు.
✴️ నరికిన ఆ చేతులతోనే ఒక్క మొక్క పెంచి చూడండి. చెట్టు విలువ, మట్టి విలువ తెలుస్తుంది.
✴️ ఈ సొసైటీకి మీరు పునాదులురా, సమాధులు కావొద్దు.
Mana Ooru Dialogue
✴️ ఏ ప్రాంతంలోనైనా మంచి ఆస్తులు ఉన్నవాడు గొప్పవాడు కాదు. మంచి ఆలోచన ఉన్నవాడు గొప్పవాడు.
✴️ ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, ఒకరు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకు ఒంటి మీద వందల డ్రెస్సులు మార్చొచ్చు. కానీ, మార్చలేనిది ఒక్కటే. అది మన అడ్రస్. అదే మన ఊరు. దాన్ని కాపాడే భాధ్యత మనదే, మనందరిదీ.
✴️ Pure minds give a clean society and a great future. Thank You.
Murali Krishna Dialogue
✴️ ఇగో మురళీకృష్ణ ఫికర్ పడకు. మా తెలంగాణలో నచ్చినోళ్ళని, దగ్గరోళ్ళని ఏకవచనంతో పిలుస్తం. మా మాటల్లో పెత్తనం ఉంటది కానీ, మనసు మెత్తగుంటది. నీకు ఓకే కదా..!
Nee Cheerakattu Dialogue
✴️ నీ చీరకట్టులో తెలుగుతనం ఉంది. మీ నడకలో హుందాతనం ఉంది. మీ మాటల్లో ముక్కుసూటి తనం ఉంది. నాకు నచ్చాయండి.
Thala Bhojanam Dialogue
✴️ శ్రీకాంత్:ఇకనుంచి ఎవ్వరైనా సరే. నాకు బురదంటింది, నాకు దురదొచ్చింది, నాకు బ్లడొచ్చింది, నా గడ్డొచ్చింది అని అడ్డమైన సాకులు చెప్తు పనాపితే… నా కొంపకే పిలిచి గూడెం గూడెం మొత్తానికి ఆకులేసి పెడతా తల భోజనం.
Vetaade Simhanni Dialogue
✴️ శ్రీకాంత్: ఇది నా సామ్రాజ్యంరా..!
✦ బాలయ్య:కూల్చేస్తా.
✴️ శ్రీకాంత్:ఏయ్..! నేను నీ రణాన్ని.
✴️ బాలయ్య:నేను నీ మరణాన్ని.
✴️ శ్రీకాంత్:నేను విలయం.
✴️ బాలయ్య:నేను ప్రళయం.
✴️ శ్రీకాంత్: నన్ను ముట్టుకోలేవ్.
✴️ బాలయ్య: నన్ను తట్టుకోలేవ్.
✴️ శ్రీకాంత్:నేను మృగాన్నిరా.
✴️ బాలయ్య: నేను దాన్ని వేటాడే సింహాన్నిరా
Okkasari Decide Aithe Dialogue
✴️ రైటైనా రాంగైనా ఒకసారి డిసైడై దిగితే, ఎవడెదురొచ్చినా వక్కలు పగిలిపోతాయ్.
✴️ ఒకసారి డిసైడై బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్ ని. తొక్కిపారదొబ్బుతా.
✴️ భగవంతుడు సృష్టికి తండ్రి. ప్రకృతి తల్లి. వాటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం. ఇది నిజం తెలుసుకోండి.
✴️ దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు.
Antham Dialogue
✴️ నాకో మైనుంది, ఒంట్లో మదముంది, నా వెనక మందుంది, నాకో గురువున్నాడు, నా గుండున్నాడని నేలతల్లి మీద చెయ్యేస్తే… అంతం. ఓం నమఃశివాయ. శివార్పనం
Krimi Samharam Dialogue
✴️ ఏంటి మారణహోమం.?
✴️ ఇక్కడ నేను క్లీన్ చేసింది మనుషుల్ని కాదు, కాలుష్యాన్ని. పొల్యూషన్ ప్యాషన్ అయిపోయింది ప్రతిఒక్కడికి. అందుకే మొదలుపెట్టాం, డస్ట్ క్లీనింగ్. In another way pest cleaning. క్రిమిసంహారం.
Both Are Not Same Dialogue
✴️ నెవర్, మీది మాది ఒకే ప్రపంచం కాదాఫీసర్..! మీరు చదివింది చట్టం, మేము నమ్మేది ధర్మం. Both are not same.
✴️మీరాదేవుడి కోసం వెతుకుతారు. మేమాదేవుడితోనే కలిసి బతుకుతాం. Both are not same.
✴️ మీకు కుటుంబమే ప్రపంచం. మాకు ప్రపంచమే కుటుంబం. Both are not same.
✴️ మీరు వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యువు. Both are not same.
✴️ ఇంత ఐస్ ముక్కని అరనిమిషం అరచేతిలో పెట్టుకోలేని మీరెక్కడ..? అనుదినం అనంత గిరుల్ని ఢీ కొట్టే మేమెక్కడ..?? Both are not same.
✴️ మీకు సమస్యోస్తే దండం పెడతారు. మేమాసమస్యకే పిండం పెడతాం. జస్ట్ లైక్ దిస్. Both are not same.
✴️ మనిషి మనుగడ కోసం మేము స్మరించేది మంత్రం. ఆ మనుగడకే ప్రమాదమొస్తే మేము చేసేది యుద్ధం. దారుణమైన యుద్ధం.
Dharma Rakshana Dialogue
✴️ అహింసా పరమో ధర్మః ధర్మ హింస తదైవచ… దాని అర్థమేమిటో తెలుసా..!
✴️ అహింస మానవుని యొక్క ప్రధమ ధర్మం. కానీ, ధర్మ రక్షణకోసం చేయు హింస అంతకంటే శ్రేష్టం. ఇప్పుడు జరిగిందది అదే. ఇక ముందు మనిషి దారి తప్పితే జరగబోయేది అదే.
Ventaadi Vadistham Dialogue
✴️ ధరణిని, తరుణిని అత్యాచారం చేసిన వాడికి no right to live. వదలం, వదిస్తాం. వెంటాడి వదిస్తాం.
Akhanda’s Promise Dialogue
✴️ మాటిస్తున్నా తల్లి..! కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా, భాదొచ్చినా, భయమొచ్చినా, చివరికి ఆ మృత్యువే ఎదురొచ్చినా, నేనెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా క్షణంలో నీ ముందుంటాను. మాట.
Post a Comment